మంగళవారం, కె. వి. పల్లి మండలం మారెళ్ళ గ్రామానికి చెందిన శ్రావణి (24) తన ప్రాణానికి ప్రమాదం ఉందని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించింది. అదే గ్రామానికి చెందిన నందకుమార్ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, అయితే అతనికి ఇప్పటికే రెండు వివాహాలు జరిగాయని తెలిసి తాను మోసపోయానని శ్రావణి తెలిపింది. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.