మంగళవారం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, కె. వి. పల్లి మండలంలోని తీతగుంటపల్లి పంచాయతీ పాత వడ్డిపల్లిలో లాయర్ ఎల్లయ్య దారుణ హత్యకు గురైన ఘటనపై స్పందించారు. ఈ దాడిలో ఎల్లయ్య ప్రాణాలు కోల్పోగా, అడ్డువచ్చిన ఆయన తల్లిదండ్రులకు కూడా గాయాలయ్యాయని తెలిపారు. ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితులను త్వరలోనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.