పీలేరు నియోజకవర్గంలో మహానాడు రెండో రోజు కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి 10 క్లస్టర్ల పరిధిలోని వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ దేశ రాజకీయాల్లో ప్రభంజనమని, రూ. 2లకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కు వంటి సంస్కరణలతో పేదల గుండెల్లో నిలిచారని అన్నారు. క్రమశిక్షణతో కూడిన ఎన్టీఆర్ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.