అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని సంజీవ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణలో నూతన ఆర్డీఓ కార్యాలయాన్ని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్ బుధవారం ప్రారంభించారు. ఎన్నికల హామీల్లో భాగంగా పీలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు సాధ్యమైందని, ప్రజల సౌకర్యం, ప్రాంత అభివృద్ధి, భావితరాల భవిష్యత్తే లక్ష్యంగా ఈ కార్యాలయం ప్రారంభించామని ఎమ్మెల్యే తెలిపారు.