బాటవారిపల్లిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కలకడ మండలంలోని బాటవారిపల్లిలో ఆదివారం బాబు నాయక్ (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామ బస్టాండ్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కలకడ ఎస్సై రామాంజులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించి, శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కలికిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్