గుర్రంకొండలో కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు పంచాయతీ భూమకంవారిపల్లికి చెందిన నరసింహులు (60), తరిగొండ రెడ్డివారిపల్లికి చెందిన లక్ష్మన్న (63) నడిమిచర్ల గ్రామం క్యారంపల్లిలో అంత్యక్రియలకు డప్పు వాయించేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఎస్ఐ రవీంద్ర వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్