వాల్మీకిపురం: స్కూటర్ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

వాల్మీకిపురంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జి. ఈశ్వరమ్మ (55) అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఇంటి ముందు నిలబడి ఉండగా వేగంగా వచ్చిన స్కూటర్ ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె కోమాలోకి వెళ్లడంతో వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్