స్క్రబ్ టైఫస్‌పై గ్రామీణులు అప్రమత్తంగా ఉండాలి: కావ్యగంధ

కలికిరి మండలంలో డాక్టర్ కావ్యగంధ బుధవారం గ్రామీణ ప్రజలను స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి అప్రమత్తం చేశారు. చిన్న చిగ్గర్ పురుగు కాటు వల్ల వచ్చే ఈ వ్యాధి లక్షణాలు జ్వరం, నల్ల మచ్చలు, శరీర నొప్పులు, శ్వాస ఇబ్బంది. రక్తపరీక్ష ఉచితంగా చేస్తారు, డాక్స్‌సైక్లిన్ లేదా అజీథ్రోమైసిన్ తో నయం అవుతుంది. పొలాల్లో పనిచేసేటప్పుడు పూర్తి దుస్తులు, రిపెలెంట్లు, శుభ్రత పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్