తాళ్ల ప్రొద్దుటూరులో 11 చీనీ చెట్లు నరికివేత జరిగింది. కొండాపురం మండలానికి చెందిన గోవర్ధన్ రెడ్డికి చెందిన ఈ చెట్లను మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికి వేసినట్టు ఎస్సై హృషికేశవరెడ్డి తెలిపారు. వాటి విలువ సుమారు రూ.20,000గా అంచనా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.