ప్రొద్దుటూరులో 6 మంది క్రికెట్ బుకీలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2.20 లక్షల నగదు, ల్యాప్ టాప్, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నిందితులకు చెందిన 16 బ్యాంకు ఖాతాల్లోని రూ. 4.14 లక్షలను ఫ్రీజ్ చేశామని వెల్లడించారు. వీరి డేటా విశ్లేషణ ద్వారా మొత్తం నెట్వర్క్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిపారు.