కడప జిల్లా చైతన్య సొసైటీకి ఉత్తమ ప్రదర్శన అవార్డు

ప్రొద్దుటూరుకు చెందిన చైతన్య ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, హెచ్ఐవి/ఎయిడ్స్ నిర్మూలన రాష్ట్రస్థాయి క్యాంపెయిన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గాను సోమవారం కడప జిల్లా డిఎంహెచ్ఓ కాన్ఫరెన్స్ హాల్‌లో అవార్డు అందుకుంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని జిల్లా డిఎంహెచ్ఓ నాగరాజు, డిఎల్‌టిఓ రవిబాబు, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫక్రుద్దీన్ చేతుల మీదుగా సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ పి. నరేష్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి టీమ్‌ను అభినందించారు.

సంబంధిత పోస్ట్