ట్రాఫిక్ నియమాలు పాటించాలంటూ విద్యార్థులకు సూచించిన సీఐ

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఎవరూ వాహనాలు నడపకూడదని ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ యాదవ్ హెచ్చరించారు. శనివారం ప్రొద్దుటూరులోని ఎస్వీ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడకూడదని సూచించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్