ప్రొద్దుటూరు మండలం ఎర్రగుంట్లపల్లె గ్రామస్థులు, సీతంపల్లె వాసుల మధ్య మంగళవారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. సీతంపల్లెకు చెందిన కొందరు, కొటాలపల్లికి చెందిన కొందరి మధ్య ఎర్రగుంట్లపల్లెలోని ఇళ్ల వద్ద గొడవ జరిగింది. ఈ గొడవ పెద్దది కావడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం గాయపడిన వారందరూ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.