ప్రొద్దుటూరులో శనివారం 13 మంది క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 11.34 లక్షల నగదు, 27 సెల్ ఫోన్లు, 1 ట్యాబ్ స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ నెట్ ప్రాక్టీస్ అకాడమీ పేరుతో బెట్టింగ్ చేస్తున్న షేక్ జావీద్ తో పాటు మరో 12 మందిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ విభుకృష్ణ తెలిపారు. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్పై నిఘా పెట్టామని ఆయన పేర్కొన్నారు.