బద్వేల్ పురపాలక సంఘం మెప్మా ఆధ్వర్యంలో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా, ముఖ్యఅతిథిగా హాజరైన బద్వేల్ మున్సిపల్ కమీషనర్ నరసింహ రెడ్డి గారు, విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, సహాయ సహకారాల గురించి వివరించారు. దివ్యాంగ పట్టణ పోరాట సమితి ప్రధాన కార్యదర్శి చింతకుంట రఫీ, పట్టణ అధ్యక్షులు బాలరాజు, మహిళా కన్వీనర్ నాగమణి, సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.