సీనియర్ విద్యార్థులకు ప్రిన్సిపాల్ వీడ్కోలు

వైఎస్సార్‌ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ సీనియర్ విద్యార్థుల ఫేర్వేల్ డే సందర్భంగా ప్రిన్సిపాల్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు ఉత్తీర్ణులై వెళ్తున్నందుకు ఆనందంగా ఉన్నా, భవిష్యత్తులో కళాశాలలో కనిపించరనే బాధతో కూడిన మిశ్రమ వాతావరణం చోటుచేసుకుందని తెలిపారు. విద్యార్థులు కళాశాలకు వచ్చిన తొలి రోజుల్లో వారిలో భవిష్యత్తుపై ఆత్మవిశ్వాసం నింపామని, ఇప్పుడు జీవితంలో పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ KV రమణయ్య, అధ్యాపకులు హరినాథరెడ్డి, ప్రదీప్ కుమార్ రెడ్డి, అశోక్ కుమార్, కిరణ్, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్