గోపవరం హత్య కేసులో ఐదుగురు అరెస్ట్: సీఐ

ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో గతనెల 27న జరిగిన లారీ డ్రైవర్ షేక్ మొహమ్మద్ హత్య కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో చిన్న కంబయ్య, ఆర్కటవేముల షాకీర్, తిప్పగాల్ల వెంకటేశ్, షేక్ మహ్మద్, మరియు ఒక మైనర్ బాలుడు ఉన్నారు. రూ. 6 వేల బాకీ విషయమై జరిగిన గొడవలో దాడి చేయడంతో గాయపడిన మొహమ్మద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు. అరెస్ట్ అయిన వారిని రిమాండ్కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్