గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం

ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ఏఎమ్ సి అధ్యక్షురాలు వద్ది సురేఖ, కార్యదర్శి రత్నరాజు, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది మూగ జీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్