రాచమల్లు మేలు మర్చిపోయావా మురళీ: వైసీపీ నేత పోరెడ్డి

ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న బస్సు మురళీకి ఎంతో సహాయం చేశారని వైసీపీ నేత పోరెడ్డి నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, మురళీని రెండుసార్లు కౌన్సిలర్‌గా చేశారని, మున్సిపల్ ఎన్నికల్లో రూ. 50 లక్షలు ఇచ్చారని, కౌన్సిల్‌లో ఫ్లోర్ లీడర్‌గా కూర్చోబెట్టారని, ఆయన కుమార్తెకు మెడికల్ సీటు ఇప్పించారని పేర్కొన్నారు. చేసిన మేలును మర్చిపోవడం సరికాదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్