ప్రొద్దుటూరులో జగనన్న కాలనీలను పరిశీలించిన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లబ్ధిదారులు తమ నుంచి డబ్బులు తీసుకుని, మెటీరియల్ డ్రా చేసి ఇళ్లు పూర్తి చేయలేదని మంత్రికి విన్నవించుకున్నారు. న్యాయం చేయాలని కోరారు.