కొండపేటకు చెందిన వృద్ధ దంపతులు వెంకటరెడ్డి, నారాయణమ్మ తమ స్థలాన్ని ఆక్రమించేందుకు పి. వెంకటరామిరెడ్డి, జయమ్మ దౌర్జన్యానికి దిగారని ఆరోపించారు. కంపకు నిప్పు పెట్టి, నిలదీసిన తమపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారని వాపోయారు. రీ-సర్వేలో భూమి తమదేనని తేలినా, ఆర్థిక బలంతో నిందితులు బెదిరిస్తున్నారని, ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.