ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఉన్న బొంగు బజార్ లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అక్కడ పొగలు అలుముకుని మంటలు భారీగా వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.