రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పోరుమామిళ్ల మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాశినాయన (M) చెన్నవరం గ్రామానికి చెందిన పోతుగంటి ఖాజావలి (48) అనే వ్యక్తి మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోవడంతో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. పోలీసులు మృతదేహాన్ని పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్