ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శనివారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణాలయాన్ని దర్శించుకున్నారు. స్థానిక శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు నంద్యాల కొండారెడ్డిలు మంత్రికి ఘన స్వాగతం పలికి, పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీకృష్ణ స్వామి ప్రతిమలను బహుకరించి, గజమాలలతో సన్మానించారు.