ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకొని విశ్రాంతి తీసుకుంటున్న ప్రొద్దుటూరు MLA నంద్యాల వరదరాజులరెడ్డితో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత గురువారం కామనూరులో సమావేశమయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై వివరాలు అందించారు. పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు మంజూరు చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.