జిల్లాలో 34 సెంటర్లలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు

కడప జిల్లాలో సోమవారం నుంచి 34 కేంద్రాలలో ఓపెన్ ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 6,503 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు, వీరిలో 5,884 మంది రెగ్యులర్, 619 మంది సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారు. సోమవారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 5,424 మంది హాజరు కాగా, 635 మంది గైర్హాజరయ్యారు. కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరు, కమలాపురంలలోని 34 ప్రభుత్వ హైస్కూళ్లలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్