ప్రొద్దుటూరులో రూ. 1.70 కోట్ల విలువైన 268 టన్నుల హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ఐరన్ మాయంపై రెండో రోజు ఆదివారం కూడా సంబంధిత హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యంను పొద్దుటూరు 3-టౌన్ పోలీసులు విచారించారు. సీఐ రామాంజనేయుడు, ఎస్ఐ సంజీవరెడ్డి ఐరన్ కడ్డీల మాయంపై సుబ్రమణ్యంను పలుకోణాల్లో ప్రశ్నించారు. అయితే, ఏఈ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని పోలీసులు తెలిపారు. గత నెలలో ఐరన్ మాయమైనట్లు గుర్తించారు. ప్రస్తుతం ఏఈని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు.