ప్రొద్దుటూరులో రామేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి అటవీశాఖ నుంచి బ్రేక్ పడింది. అప్రోచ్ రోడ్లు ఆర్ఎఫ్ లోకి వస్తున్నాయంటూ అభ్యంతరం తెలిపింది. రామేశ్వరం పెన్నా నదిపై రూ. 53కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఎండీఆర్ గ్రాంట్ స్కీమ్ నిధులతో ప్రొద్దుటూరు-ఆర్టీపీపీ మార్గంలో ఆర్ అండ్ బి బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సుమారు 65 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్రోచ్ రోడ్లు నిర్మించాల్సి ఉంది.