ప్రొద్దుటూరు: టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

ప్రొద్దుటూరు శివారులో జమ్మలమడుగు రోడ్డులో టిప్పర్ ఢీకొని కమలాపురం మండలం సంబటూరు గ్రామానికి చెందిన పొట్టిగారి అయ్యవారు (51) మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య దేవికి తీవ్ర గాయాలయ్యాయి. మైలవరంలో చదువుతున్న కుమార్తెకు నూతన సంవత్సర కానుకలు ఇచ్చి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్