ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత ఉందని, దీన్ని ఇలానే కొనసాగేలా చూడాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి పార్టీ కార్యకర్తలకు సూచించారు. బుధవారం సాయంత్రం టీడీపీ సంస్థాగత కమిటీల నియామకంపై సమావేశం జరిగింది. సమావేశంలో కొండారెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ నెల 1 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. ప్రజలు బాగా రిసీవ్ చేసుకుంటున్నారన్నారు.