విద్యార్థులకు సరిపడా టీచర్లను నియమించాలని తల్లిదండ్రులు ప్రొద్దుటూరులోని ఎంఈఓ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. 159 మంది విద్యార్థులు ఉన్నచోట ఇద్దరే టీచర్లుంటే తమ పిల్లల చదువులెలా సాగుతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులోని రామేశ్వరం మున్సిపల్ మోడల్ స్కూల్ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లను ఎందుకు నియమించలేదంటూ ప్రశ్నించారు. నిరసన సమయంలో కార్యాలయంలో ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి సమస్యను విన్నవించారు.