ప్రొద్దుటూరులోని పెద్దసెట్టిపల్లెకు చెందిన దళితులను పబ్లిక్ రోడ్డులో తిరగనీయకుండా అడ్డుకుంటున్నారంటూ గురువారం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ప్రజా మహిళా సంఘం సభ్యులు నిరసన తెలిపారు. బాధితులకు అండగా ఉండాల్సిన రూరల్ పోలీసులు బాధితులనే బెదిరిస్తున్నారని, ఇబ్బందులకు గురిచేస్తున్నారని మహిళ సంఘం కార్యదర్శి వెంకటసుబ్బమ్మ తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.