ప్రొద్దుటూరు: కాలువకు రక్షణగోడ నిర్మించాలని విద్యార్థి వినతి

ప్రొద్దుటూరుకు చెందిన 6వ తరగతి విద్యార్థి ఎబినేజర్, కాలువకు రక్షణ గోడ లేకపోవడంతో తన స్నేహితుడు కిందపడటంతో చలించిపోయాడు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా వెంటనే రక్షణ గోడ నిర్మించాలని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి విన్నవించాడు. త్వరగా గోడ నిర్మించకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని విద్యార్థి హెచ్చరించాడు. అతని ధైర్యసాహసాలు ప్రశంసనీయం.

సంబంధిత పోస్ట్