ప్రొద్దుటూరు: ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య కొనియాడారు. గురువారం ఆయన ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి జడ్పీహెచ్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు పద్మనాభరాజు పొద్దుటూరు నియోజకవర్గం రాజుపాలెం జడ్పీహెచ్ స్కూల్ టీచర్ రషీద్ ఖాన్ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వారిని సత్కరించారు. ఎంతో ఓర్పుతో, సహనంతో విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైందని వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్