ప్రొద్దుటూరులో టీస్టాల్ సిబ్బందికి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారికి మధ్య టీ విషయమై మొదలైన గొడవ జేసీబీతో కూల్చివేత వరకు వెళ్లింది. అక్కడి సీసీ కెమెరాల దృశ్యాల మేరకు సదరు అధికారి బుధవారం ఉదయం కోర్టు ఎదురుగా ఉన్న టిఫిన్ సెంటర్లో టీ తాగాడు. ఆ సందర్భంగా టీ స్టాల్ సిబ్బందితో గొడవపడి, కూల్చివేతకు జేసీబీని పంపాడని వ్యాపారి తెలిపాడు. ఫుట్ పాత్ ఆక్రమణపై చర్యలకు జేసీబీని పంపామని సదరు అధికారి తెలిపారు.