రాజుపాలెం మండలం తొండలదిన్నె గ్రామంలో సోమవారం జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 28,375 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగులు, మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.