ఈనెల 28 నుంచి సమ్మర్ క్యాంప్: లైబ్రేరియన్ తిరుపతమ్మ

ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో గల ప్రభుత్వ గ్రంధాలయంలో ఈనెల 28వ తేదీ నుండి విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ప్రారంభం కానుంది. లైబ్రేరియన్ తిరుపతమ్మ ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ క్యాంపులో బుక్ రీడింగ్, స్టోరీ రీడింగ్, స్పోకెన్ ఇంగ్లిష్, డ్రాయింగ్, చెస్, జనరల్ మ్యాథ్స్ వంటి అంశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు శిక్షణ అందిస్తారు. విద్యార్థులు ఈ సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్