ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 24వ వార్డు సచివాలయం బుధవారం మూత పడింది. దాంతో ఉదయం వివిధ సేవల కోసం సచివాలయంకు వెళ్లిన ప్రజలు వెనుతిరిగి వెళ్లారు. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా. అక్కడి ఉద్యోగులను విచారించి చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. గురవయ్య తోటలో కల్వర్టు గొయ్యిపై చర్య తీసుకోవాలని ఇంజినీరును ఆదేశించామన్నారు. సమస్య పరిష్కరిస్తామన్నారు.