ఏవైనా సమస్యలు ఉంటే అధికారులు లేదా శాసన సభ్యుల దృష్టికి తెచ్చి పరిష్కారం చేసే దిశగా 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో జరుగుతుందని టీడీపీ నాయకులు తెలిపారు. ఆదివారం రాష్ట్ర కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఆదేశానుసారం ప్రొద్దుటూరులోని 25వ వార్డులోని పూలతోట వీధి, శాoత కుమారి వీధుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.