కొండారెడ్డిపై ఉక్కు ప్రవీణ్ సంచలన ఆరోపణలు.!

ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు, కొండారెడ్డి కలిసి తనపై రాళ్లదాడి చేయించారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాచమల్లు వెంట ఉన్నవారే ఇప్పుడు కొండారెడ్డి పక్కన చేరి దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. తాను ఉన్నన్ని రోజులు టీడీపీ కోసం పనిచేస్తానని ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్