ప్రొద్దుటూరులో రాజకీయాలు తీవ్రంగా మారాయి. టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే వరద, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు వర్గీయులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు. అసాంఘిక కార్యక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జా, కాంట్రాక్టు పనుల్లో అవినీతి, ఆర్థిక లావాదేవీలు, ప్రైవేటు పంచాయితీలు వంటి ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మీడియా, అధికారులు కూడా వివాదంలోకి లాగబడుతున్నారు.