ప్రొద్దుటూరులో జలమయమైన రోడ్లు

ప్రొద్దుటూరులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీ కాల్వలు ఆక్రమణలకు గురవడంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించి, చెరువులను తలపించింది. గాంధీరోడ్డు, వెంకటేశ్వరపేట, కుమ్మరకొట్టాల, శ్రీరాములపేట, శ్రీనివాసనగర్, కోనేటికాల్వ వంటి ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్