కడపలో ఆంధ్రజ్యోతి పేపర్ లేకుండా చేస్తాం: రాచమల్లు

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాట్లాడిన మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు. మహిళలకు క్షమాపణ చెప్పకపోతే 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే కడప జిల్లాలో ఏబీఎన్ కార్యాలయం, పేపర్ ఉండవని హెచ్చరించారు. ఒకవేళ ఆంధ్రజ్యోతి పత్రిక కనబడితే తన పేరు తిప్పి పెట్టుకుంటానని రాచమల్లు తీవ్రంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్