ప్రొద్దుటూరులో ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరో?

ప్రొద్దుటూరు 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తప్పిపోయిన 6 సంవత్సరాల బాలుడు క్షేమంగా ఉన్నాడని, తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్లాలని ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఒంటరిగా కనిపించిన బాలుడిని పోలీసులు చేరదీసి రక్షణలో ఉంచారు. బాలుడు తన పేరు లక్కి, తండ్రి రాజేశ్, తల్లి రేణుక అని, ఆళ్లగడ్డకు చెందినవాడినని చెప్పినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. సంప్రదించాల్సిన నంబర్లు CI-9121100590, SI-9121100591.

సంబంధిత పోస్ట్