ప్రొద్దుటూరులో శుక్రవారం, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు 2 కిలోమీటర్ల మేర జరిగిన ఈ ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.