మండల వ్యవసాయాధికారి ఓబులేసు తెలిపిన వివరాల ప్రకారం, రబీ సీజన్‌కు సంబంధించి 150 క్వింటాల్ వేరుశనగ కాయలు మంజూరయ్యాయి. రేపటి నుంచి వీటి పంపిణీ ప్రారంభం కానుంది. ఒక రైతుకు కనిష్ఠంగా 30 కిలోలు, గరిష్ఠంగా 90 కిలోల వరకు అందజేస్తారు. పూర్తి ధర రూ. 9200 కాగా, సబ్సిడీ రూ. 3680 తీసివేయగా, రైతు వాటా రూ. 5520గా నిర్ణయించారు. పంపిణీ కోసం భూమి పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్‌తో ఆర్ఎస్ కె లలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.