వేంపల్లిలో వరుస చోరీలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శనివారం శ్లోక స్కూల్ సమీపంలోని జమ్మి చెట్టు వద్ద ఉన్న డిక్సన్ కంపెనీ ఉద్యోగి షేక్ అఖిల ఇంట్లో దొంగలు తాళాలు పగలగొట్టి ప్రవేశించారు. ఇంట్లో ఉన్న సుమారు 2 తులాల బంగారం, రూ. 50 వేల నగదు, వెండి వస్తువులను అపహరించుకెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.