సిద్దవటంలో పిచ్చి కుక్క స్వైర విహారం

సిద్దవటం దిగువపేటలో సోమవారం ఓ పిచ్చికుక్క వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ హల్‌చల్ చేసింది. చిన్న పిల్లలు ఆడుకుంటుండగా వారిపై, అక్కడున్న పెద్దలపై దాడి చేసి గాయపరిచింది. ఇందులో షేక్ ఫాతిమా, కోటపాటి నందకృష్ణ, బత్తెన బాల గుర్రయ్య, పాలెం వసంతతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు వారిని సిద్దవటం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్