వేముల మండలం తుమ్మలపల్లెలో శనివారం, పులివెందుల జేఎన్టీయూ విద్యార్థులు గ్రామస్థులకు స్వచ్ఛత, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. స్వచ్ఛత పక్షోత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామస్థులతో కలిసి స్వచ్ఛత ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమంలో యూసీఐఎల్ ఉద్యోగులు, సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.