రేషన్ షాపు వద్ద లబ్ధిదారుల ఆందోళన

పులివెందుల పట్టణంలోని స్థానిక రాజారెడ్డి కాలనీలో బుధవారం 18వ రేషన్ షాపు వద్ద లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. 20 కిలోలకు గాను కేవలం 13 కిలోల బియ్యం మాత్రమే ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపించారు. దీనిపై రేషన్ డీలర్‌ను నిలదీస్తే, ఆయన వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాధితులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్